తిమ్మాపూర్, ఫిబ్రవరి14: మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థుల అనుచరులు దూషణలకు దిగుతున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ 8వ డివిజన్ అలుగునూర్లో కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందాడు. ఫలితాలు వెల్లడైన తర్వాత శుక్రవారం రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి గోపు మల్లారెడ్డి అనుచరులు ఓటర్లను దూషిస్తూ విచక్షణ కోల్పోయి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన పదజాలంతో వాట్సాప్ స్టేటస్లు పెట్టారు.
ఇది చూసిన వాళ్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల బుద్ధి మారదని, తగిన శాస్తి జరిగిందని డివిజన్ వాసులు చర్చించుకుంటున్నారు.