చిన్న పరిశ్రమలను ఆదుకోండి

- కేంద్ర ఆర్థిక మంత్రి,ఆర్బీఐ గవర్నర్కు ఎఫ్టీసీసీఐ వినతి
హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) తీవ్రంగా నష్టపోయాయని, వాటిని ఆదుకొనేందుకు సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) కేంద్ర ఆర్థికమంత్రితోపాటు ఆర్బీఐ గవర్నర్కు విజ్ఞప్తిచేసింది. అత్యవసర రుణ పథకాన్ని ప్రవేశపెట్టాలని, రుణ వాయిదాల చెల్లింపు గడువును పెంచాలని, ప్రోత్సాహకాలు ప్రకటించాలని కోరింది. ఈ మేరకు గురువారం ఆన్లైన్లో ఇద్దరికి లేఖలు పంపించింది. లాక్డౌన్ కారణంగా తలెత్తిన ఇబ్బందులు, దాన్నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు గురువారం ఎఫ్టీసీసీఐ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈలపై ప్రధానంగా చర్చించారు. లాక్డౌన్ వల్ల వ్యాపారాలు సాగక రుణ వాయిదాలు చెల్లించే పరిస్థితిలో ఎంఎస్ఎంఈలు లేవని, ఈ క్రమంలో ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. వడ్డీ రేట్లను తగ్గించడంతోపాటు వాయిదాల కోసం బ్యాంకులు ఒత్తిడి చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు రమాకాంత్ ఇనానీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- rbi
- small industries
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

