Suryapet | హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ఉత్తర, వాయవ్య దిశ నుంచి వీస్తున్న వేడిగాలులతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆదివారం సూర్యాపేట జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 44 డిగ్రీలు నమోదు కాగా, పలుచోట్ల 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండు రోజులు సాధారణం కంటే 2 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 19, 20 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.