కరీంనగర్, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : తన ఇంటిపై దాడి చేసి, గూండాల్లా వ్యవహరించి, కులం పేరుతో దూషించిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శుక్రవారం కరీంనగర్ రూరల్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.
‘గురువారం కరీంనగర్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ప్రెస్‌మీట్ అనంతరం హైదరాబాద్ వెళ్లానని, అదేరోజు సాయంత్రం కాం గ్రెస్‌కు చెందిన 20 మంది గూండాలు, రౌ డీషీటర్లు గంగాధర మండలం బూరుగుపల్లిలోని తన ఇంటిపై దాడి చేసి, దుర్భాషలాడా రని, దాడిలో ఉన్న ఒడ్నాల యగ్నేష్ అనే రౌడీషీటర్ హత్య కేసులో జైలుకెళ్లి ఇటీవలే వచ్చాడని, అనిల్‌రెడ్డి, మ్యాక వినోద్ (రౌడీ షీటర్), శ్రీను పటేల్, ఒడ్నాల వంశీ, రోహిత్ బిట్టు, ముత్యం శంకర్, అజయ్‌గౌడ్ తదితరు లున్నారని పేర్కొన్నారు. దాడి జరిగినప్పుడు ఇంట్లో భార్య దీవెనతోపాటు బంధువులు ఉన్నారని, హైదరాబాద్ నుంచి వచ్చి శుక్రవారం ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.