రాజాపేట, సెప్టెంబర్ 5 : వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో మీడియాతో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో వరద బాధితులకు సా యం చేస్తున్నామని మంత్రి సీతక ముళ్లె,మూటలు నెత్తిన పెట్టుకొని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసుకున్నారు కదా.. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలకు నష్టపోయిన వారిని ఆదుకోవాలనే సోయిలేదా అన్ని ప్రశ్నించారు. వరదప్రభావిత ప్రాంత ప్రజలను పరామర్శించి, భరోసా కల్పించకపోవడం శోచనీయమని విమర్శించారు.