హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కుమారుడు హిమాన్షు ఫేస్బుక్లో ఆసక్తికర పోస్టు చేశారు. ‘ఓ సోదరుడిగా.. ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటా.. ఎలాంటి కష్టాలు ఎదురైనా మనం కలిసి ఎదురొందాం’ అని పేర్కొన్నారు. ‘వాత్సల్యతో నాకు దాదాపు 13 ఏండ్లుగా స్నేహం ఉన్నది. మాగంటి గోపీనాథ్ మృతి తర్వాత తను కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. తల్లి సునీత ఎన్నికల ప్రచారంలో వాత్సల్యనాథ్ కీలక పాత్ర పోషించడం గర్వంగా ఉన్నది’ అని హిమాన్షు పేర్కొన్నారు. వాత్సల్యనాథ్తో గతంలో దిగిన ఫొటోలను హిమాన్షు షేర్ చేశారు.