సిద్దిపేట, మార్చి 3: మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖకు ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం సన్‌ప్లవర్ కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు పంటను అమ్మి నష్టపోతున్నారని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని హరీశ్‌రావు ఆదివారం సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని లేఖలో పేర్కొన్నారు. హరీశ్‌రావు లేఖ ప్రభావంతో సోమవారం సిద్దిపేట వ్యవసాయ మారెట్ యార్డులో 2024-25 యాసంగి సీజన్‌కు సన్‌ఫ్లవర్ కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సన్‌ఫ్లవర్ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించి క్వింటాలుకు మద్దతు ధర రూ.7,280 పొందాలని సూచించారు. సిద్దిపేట జిల్లాలో 11,193 ఎకరాల్లో సన్‌ఫ్లవర్ సాగు అయినట్టు తెలిపారు. హుస్నాబాద్, బెజ్జంకి, గజ్వేల్, తొగుట, చిన్నకోడూర్, అకన్నపేటలో సన్‌ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను స్థానిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభిస్తామని చెప్పారు.