హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా చెవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్గా స్పందించింది. జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని కమిషన్.. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా హెచ్ఆర్సీ నంబర్ 7141/2025గా కేసు నమోదు చేసింది.
ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రోడ్డు భద్రతా లోపాలు, అతివేగం, హైవే విస్తరణ ఆలస్యం, అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలపై కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రవాణా, హోం, గనులు, భూగర్భశాఖలు, ఎన్హెచ్ఏఐ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, టీజీఎస్ అధికారుల నుంచి ప్రమాదంపై సమగ్ర నివేదికలను డిసెంబర్ 15న ఉదయం 11 గంటలలోపు సమర్పించాలని ఆదేశించింది. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది.