హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): వేసవి సెలవుల్లో విద్యార్థులు చదువుపై దృష్టి సారించేలా పాఠశాల విద్యాశాఖ సమ్మర్ అభ్యాస క్యాంపును నిర్వహించనున్నది. దీనికోసం స్విఫ్ట్ చాట్ యాప్ పేరు గల డిజిటల్ హోం లెర్నింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల్లో ప్రశ్నల సాధన ద్వారా వారి పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. ప్రస్తుతం 4వ తరగతిలోని వారికి 3వ తరగతి ప్రశ్నలు, 10వ తరగతిలోని వారికి 9వ తరగతి ప్రశ్నలను ఇస్తారు.