హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బడులకు నేడే చివరి పనిదినం కానున్నది. రేపటి నుంచి జూన్ 11 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. మళ్లీ జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా బడులు తెరుచుకోనున్నాయి.
అదే రోజు నుంచి 2026 -27 విద్యాసంవత్సరం ప్రారంభం కానున్నది.