కాంగ్రెస్ కార్యకర్త: సుజాతక్క ఈసారి కాంగ్రెస్‌కే ఓటెయ్యాలే
సుజాత: ఏం జేసిందయ్యా మీ కాంగ్రెస్ ? ఎందుకెయ్యాలె ?
కాంగ్రెస్ కార్యకర్త: మొన్ననే కాంగ్రెస్‌ల చేరిన్నక్కా. నా కోసం ఈ ఒక్కసారి చేతి గుర్తుకు ఓటెయ్యి
సుజాత: నీ కోసం అయితే ఓ పూట ఇంటికి రా. ఇంత చికెన్, బగార ఒండిపెడత కని ఓటైతె అడగకు
కాంగ్రెస్ కార్యకర్త: మరి ఎవర్కి ఓటెస్తవ్
సుజాత: పక్కా కారు గుర్తుకే ఏస్త
కాంగ్రెస్ కార్యకర్త: ఏందక్కో గంత పక్కాగ చెప్పవడ్తివి
సుజాత: కాంగ్రెస్ ఉన్నప్పుడు వారానికోపారి నీళ్ల ట్యాంకర్ ఒస్తుండే. రెండు బిందెల నీళ్లు వట్టేందుకు ట్యాంకర్ ఒచ్చినప్పుడల్లా బస్తోళ్లకు కొట్లాటలే ఉంటుండె. పొద్దుగాల మొఖాలు చూసుకోకుండా అయ్యేటోల్లం. నీ పెండ్లాం తోటి గిట్ల ఎన్నిసార్లు లొల్లాయె.
కాంగ్రెస్ కార్యకర్త: గవన్నీ ఇంక గుర్తున్నాయక్కా నీకు
సుజాత: అన్ని గుర్తున్నయ్. ఇయాల కేసీఆర్ పుణ్యాన సరిపోను నల్ల నీళ్లొస్తున్నయ్. పాతయి మర్వను. కారుకు ఓటేసుడు మర్వను. మరిస్తే ఇమానం తప్పినట్టే.
కాంగ్రెస్ కార్యకర్త: సరే అక్కా.. ఇగ నువ్వు ఎన్ని చెప్పినా ఇనవు. ఉంట.
– వరుణ్