హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): మాజీ సర్పంచుల ఆత్మహత్యలను సుమోటో తీసుకుని ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర మానవ హకుల కమిషనర్‌కు తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
2019నుంచి 2024 వరకు సర్పంచులు డబ్బులు అధిక వడ్డీలకు తెచ్చిమరీ.. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశారని పేర్కొన్నారు. 18నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా తాత్సారం చేస్తుండటంతో అప్పులబాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, నాయకులు బీరప్ప, కోర్వ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.