KGBV | స్టేషన్‌ఘన్‌పూర్, జూన్ 23 : జనగామ జిల్లాలో కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకెళ్తే.. చిల్పూర్ మం డలం కిమానితండాకు చెందిన ఇస్లావత్ పీర మ్మ, కిషన్ దంపతులు తన కూతురు వర్షిణి(14)ని 21న చిల్పూర్ కేజీబీవీలో 9వ తరగతిలో చేర్పించారు. మరుసటి రోజు ఉదయం పడుకొన్న వర్షిణి నోటి నుంచి నురుగలు రావడం, పక్కనే కూల్ డ్రింక్ బాటిల్‌ను అటెండర్ గమనించింది. చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.