సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 4 : ఉద్యోగం రాలేదన్న దిగులుతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు ఉసురు తీసుకున్నాడు. సిరిసిల్ల సీఐ కృష్ణ వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని అంబికానగర్‌కు చెందిన చింతకుంట దుర్గాప్రసాద్(22) స్థానికంగా ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో సెకండియర్ చదువుతున్నాడు. గతంలో వివిధ పోటీ పరీక్షలు రాశాడు. ఎటువంటి ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెంది గురువారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి చింతకుంట శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.