ఇన్స్టాగ్రామ్లో వేధింపులే కారణమా?
నీలగిరి, సెప్టెంబర్ 5 : నల్లగొండ జిల్లా కేంద్రంలో అనుమానాస్పద స్థితి లో ఇద్దరు యువతులు ఆత్మహత్యాయ త్నం చేసుకోవడం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. మనీష, శివాని స్నేహితులు. నల్లగొండలోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీజడ్సీ సెకండియర్ చదువుతున్నారు. ఫస్టియర్ సెమిస్టర్ పరీక్షలు కాగానే ఆగస్టు 16న ఇద్దరూ వారి సొంతూళ్లకు వెళ్లారు. మంగళవా రం ల్యాబ్ పరీక్షలకు హాజరయ్యారు. ఆ తరువాత నల్లగొండలోని రాజీవ్ పార్కుకు వెళ్లి గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. సిబ్బంది గమనించి జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని తోటి విద్యార్థినులు పేర్కొంటున్నారు. వారి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని ఆ దిశగా విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.