Harish Rao | కాంగ్రెస్ అధికార దుర్వినియోగం..బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు
మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
- బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తేతెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు యథేచ్ఛగా ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించారని బుధవారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తా రు. అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలకు బెదరకుండా బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషిచేసిన పార్టీ నేతలు, ఇన్చార్జ్జులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. బీఆర్ఎస్పై విశ్వాసంతో కారు గుర్తుకు ఓటేసిన ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు మొదలు.. పోలిం గ్ ముగిసేదాకా అధికార కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించడమే గాక, వారిపై భౌతికదాడులకు తెగబడటం హీనమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు. నీచ రాజకీయాలకు దిగడం ప్రజాస్వామ్య వ్యవస్థను అ వమానించడమేనని పేర్కొన్నారు. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తిన కొందరు పోలీసుల తీరు గర్హనీయమని ఆక్షేపించారు. కాంగ్రెస్ కుట్ర లు, కుతంత్రాలు, డబ్బు సంచులు, ప్రజాతీర్పును ఏమాత్రం ప్రభావితం చేయలేవని కుండబద్దలు కొట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

