యాలాల/అయిజ, సెప్టెంబర్ 16: చేసిన పనికి జీతాలు ఇవ్వకపోవడంతో ఇద్దరు కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు ఆత్మహత్యాయ త్నం చేశారు. ఈ ఘటన సోమవారం వికారాబాద్ జిల్లాలోని తాండూరులో జరిగింది. తాండూరు మున్సిపల్లో నర్సింహులు, జ్యోతితోపాటు మరో ఏడుగురు ఓ బృందంగా ఏర్పడి కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. మిగిలిన వారికి జీతాలు వచ్చాయి. కానీ నర్సింహులు, జ్యోతికి రాకపోవడం తో మనస్తాపానికి గురయ్యారు. పెట్రోలు డబ్బాతో మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఆత్మహత్యాయత్నం చేశారు. మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డి మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికులు ఏర్పాటు చేసుకున్న గ్రూప్లో వారి పేర్లు లేవని, అందువల్లే వారికి జీతాలు ఇవ్వలేదని చెప్పారు.
ప్రజా పాలనలో కలెక్టర్కు దరఖాస్తు ఇస్తే అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పెట్రోల్ డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. జోగుళాం బ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో ప నిచేసే ఔట్ సోర్సింగ్ కార్మికులకు రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో నీటి వి భా గం, హరితహారం, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్ వి భాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 86 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలిస్తున్నదే తప్పా.. ఆచరించడం లేదని చెప్పారు. జూలై, ఆగస్టు నెలల జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబపోషణ భారంగా మారిందని వాపోయారు. జీతాలు సకాలంలో చెల్లించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.