అచ్చంపేట/లింగాల, డిసెంబర్ 20 : ఎస్సై బెదిరింపులు, వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ యువకుడు పురుగుల మందు డబ్బాతో ఉన్న వీడియో నాగర్‌కర్నూల్ జిల్లాలో వైరల్‌గా మారింది. యువకుడి కథనం మేర కు.. లింగాల మండలం అప్పాయిపల్లికి చెందిన ఆవుల పురుషోత్తంకు చెందిన పొలం పక్కన ఉన్న మరో మహిళా రైతు నుంచి వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. ఈ విషయం తెలుసుకొన్న ఎస్సై నాగరాజు అతడి బంధువైన పెద్దమల్లయ్యకు పొలా న్ని ఇప్పించే విషయమై పురుషోత్తాన్ని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి సెల్‌ఫోన్ లాక్కొన్నాడు.
‘నా సంగతి తెల్వదు.. నాతో పెట్టుకుంటావా.. నీపై అట్రాసిటీ కేసు నమోదు చేసి రౌడీషీటర్ ఓపెన్ చేసి నీ సంగతి చెప్తా’.. అంటూ అనరాని మాటలతో ఎస్సై బెదిరించాడు. నా చావుకు ఎస్సై నాగరాజుదే బాధ్యత’.. అంటూ వీడియో చిత్రీకరించాడు. కాగా, భూమి విక్రయంలో ఈరమ్మ, మల్లయ్యను పురుషోత్తం బెదిరించాడని ఎస్సై నాగరాజు తెలిపారు. మల్లయ్య ఫిర్యాదు మేరకు పురుషోత్తంను స్టేషన్‌కు పిలిచి మంచి పద్ధతి కాదని చెప్పానని వివరించారు.