Murder Case | ఫిర్యాదు చేసినందుకు కక్ష గట్టి రిటైర్డ్ ఎంపీడీవో హత్య..సుఫారీ గ్యాంగ్ సభ్యుల అరెస్టు
Murder Case | వరంగల్ ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు.
జనగామ : వరంగల్ ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య జరిగిన మూడు రోజుల్లోనే నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. హత్య వివరాలతో పాటు నిందితుల వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్(Warangal CP) ఏ.వి. రంగనాథ్ ఆదివారం వెల్లడించారు.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య (70)(Retired MPDO) సర్వే నం 174 భూములకు సంబంధించిన విషయంలో గిరబోయిన అంజయ్యతో తగాదాలు నడుస్తున్నాయి. ఈ విషయంలో రిటైర్డ్ ఎంపీడీవో అధికారులకు ఫిర్యాదు చేయడంతో కక్షను పెంచుకున్న అంజయ్య బచ్చన్నపేటకు చెందిన దండుగుల తిరుపతిని సంప్రదించాడు. రామకృష్ణయ్యను అంతమొందిస్తే రూ. 8లక్షలు ఇస్తానని రూ.50వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. దీంతో తిరుపతి మరో ముగ్గురు డోలకొండ శ్రీకాంత్, శివరాత్రి బాషా ఆలియాస్ భాస్కర్, దండుగుల రాజు అనే వ్యక్తులతో కలిసి రామకృష్ణయ్య హత్యకు వ్యూహరచన చేశారు.
ఈనెల 15న సాయంత్రం 5.30 నిమిషాలకు పోచన్నపేట గ్రామ శివారు ప్రాంతంలో బచ్చన్నపేట నుంచి పోచన్నపేటకు వెళుతున్న కారుతో అటకాయించి రామకృష్ణయ్యను నలుగురు బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. అనంతరం చిన్నరామన్చర్ల గ్రామ శివారు ప్రాంతంలో రామకృష్ణయ్యను కారు నుంచి దింపి టవల్‌తో మెడను బిగించి ఊపిరి అడకుండా చేసి దారుణంగా హత్య (Murder)చేశారని సీపీ వెల్లడించారు. అనంతరం చంపక్ హిల్స్ ప్రాంతంలోని క్వారీ నీటిగుంటలో రామకృష్ణయ్య మృతదేహాన్ని పడేసి నలుగురు నిందితులు పారిపోయారని తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు ప్రధాన నిందితుడు అంజయ్యను గుర్తించి విచారించగా నిందితుల పేర్లు బయటకు వచ్చాయని తెలిపారు. అంజయ్యతోపాటు డోలకొండ శ్రీకాంత్, భాస్కర్‌ను అరెస్టు(Arrest) చేశామని, దండుగుల తిరుపతి, దండుగుల రాజు పరారీలో ఉన్నారని వివరించారు. నిందితుల నుంచి కారు, మూడు సెల్ఫోన్లు , రూ. 15వేల నగదును స్వాధీనం చేసుకున్నామని సీపీ పేర్కొన్నారు. ఈ హత్య కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం, జనగామ ఏసీపీదేవేందర్ రెడ్డి, ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, నర్మెట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగబాబు, బచ్చన్నపేట ఎస్.ఐ నవీన్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాంబాబు, ఎస్.ఐ దేవేందర్, శరతో పాటు సిబ్బందిని సీపీ అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

