హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పిందొకటి ఇప్పుడు చేస్తున్నదొకటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దని ప్రకటించారని, డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారని, ఇప్పటివరకు లోన్ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి.. తీసుకున్నోళ్లకు తమ ప్రభుత్వం రుణమాపీ చేశాక బ్యాంకోళ్లు మళ్లీ లోన్లు ఇస్తరు అని ప్రకటించారని చెప్పారు.
కానీ, అధికారంలోకి వచ్చి వంద రోజులు గడుస్తున్నా.. పంట రుణాలపై కాంగ్రెస్ సర్కారు ఎటూ తేల్చకపోవడంతో రైతన్నలకు బ్యాంకుల అధికారులు లీగల్ నోటీసులు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈమేరకు ఎక్స్ మేదికగా ట్వీట్ చేశారు.
ఇవి ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి చెప్పిన మాటలు.👇
▶️బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దు.
▶️డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం.
▶️ఇప్పటివరకు లోన్ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి. తీసుకున్నోళ్లకు మా… pic.twitter.com/hxKapf2DYW
— KTR (@KTRBRS) March 24, 2024