హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : సర్కారు బడుల్లోని విద్యార్థులను ఫుట్బాల్ ఆటల్లో ప్రోత్సహించడంలో భాగంగా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. సుబ్రతో కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ను రాష్ట్రంలో నిర్వహిస్తున్నది. ఇప్పటికే జిల్లాస్థాయిలో అండర్-14 పోటీలు జరుగుతుండగా, ఇవి ముగిసిన తర్వాత రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నారు.
ఈ పోటీల్లో ప్రతిభచూపిన సర్కారు బడుల్లోని విద్యార్థులను ఎంపికచేసి, ప్రత్యేక వసతులు కల్పించి తర్ఫీదునిస్తారు. సుబ్రతో కప్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ దేశంలోనే ప్రతిష్టాత్మక ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ టోర్నమెంట్. 1960 నుంచి ఏటా ఈ కప్ పోటీలను నిర్వహిస్తున్నారు.