హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల షెడ్యూల్‌ను 2 వారాల్లోగా సమర్పించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)ని హైకోర్టు ఆదేసించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ ప్రస్తుత సభ్యుల పదవీకాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించడం లేదని న్యాయవాది అశోక్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ ఆదేశాలను జారీచేసిన హైకోర్టు.. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
ఫోన్ల ట్యాపింగ్‌పై ఫిర్యాదు ఏ దశలో ఉందో చెప్పండి ; ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): గత ప్రభుత్వ హయాంలో ఫోన్ల ట్యాపింగ్ జరిగిందనే ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలియజేయాలని సమాచార హకు చట్టం కింద కోరితే వివరాలు ఇవ్వడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో ఆ ఫిర్యాదు ఏ దశలో ఉందో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమాచార హకు చట్టం కింద ఆ ఫిర్యాదు వివరాలను తెలియజేయకపోవడంపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.