హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో తెలంగాణపై కుట్ర నిజమేనని ఎన్నో రుజువులు చెప్తున్నాయి. అక్టోబర్ 26వ తేదీ నుంచి ఈ కేసులో తెలంగాణ పోలీసుశాఖ పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. ఆధారాలన్నీ శాస్త్రీయంగా సేకరిస్తూ.. కుట్రపై అన్ని కోణాల్లోనూ సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నది. తొలుత వీడియోలు, ఆడియోలు సేకరించిన పోలీసులు దాన్ని అథెంటిఫికేషన్ కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ డివిజన్(ఎఫ్ఎస్ఎల్)కు పంపించారు. శాస్త్రీయంగా ధ్రువీకరించుకున్నాకే, వాటిని కోర్టుకు సమర్పించారు.
టీఆర్ఎస్కు అందజేసిన రోహిత్‌రెడ్డి
కేసీఆర్ చేతికి ఆధారాలన్నీ ఎలా వచ్చాయి?.. అనేది కొన్ని వెర్రిబుర్రలకు అర్థంకాలేదు. ఏదైనా ఒక కేసు నమోదైన తర్వాత కోర్టుకు ఆధారాలు సమర్పించే సమయంలో పోలీసులు నిందితులకూ ఫిర్యాదుదారుడికీ ఆ ఆధారాలను అందజేస్తారు. అదంతా నిబంధనల ప్రకారమే. ఓ కేసులో ఆధారాలను ఎప్పుడైతే కోర్టుకు సమర్పిస్తారో.. ఆ తర్వాత అది పబ్లిక్ ప్రాపర్టీ అయిపోతుంది. అందరికీ అందుబాటులో పబ్లిక్ డొమైన్లో ఉండిపోతుంది. నిబంధనల ప్రకారమే.. పోలీసులు నిందితులతోపాటు ఫిర్యాదుదారుడైన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కూడా ఆధారాల కాపీలను అందజేశారు. రోహిత్ రెడ్డి ఆ ఆధారాలను టీఆర్ఎస్కు చేరవేశారు. అయితే.. తెలంగాణపై జరిగిన కుట్రకు సంబంధించిన అన్ని విషయాలూ ప్రతిఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని గ్రహించిన కేసీఆర్.. ఆ వివరాలను దేశం ముందు ఉంచారు. బీజేపీ బ్రోకర్ల తతంగమంతా తెలిసేలా వీడియోలు, ఆడియోలన్నీ… సుప్రీంకోర్టు చీఫ్జస్టిస్తోపాటు అన్ని రాష్ర్టాల్లోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, అందరు ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల అధ్యక్షులు, డీజీపీలు, ప్రింట్ మీడియా అధినేతలు, న్యూస్ఏజెన్సీలు, బార్ అసోసియేషన్లకు సీఎం కేసీఆర్ పంపించారు.
సమగ్ర అధ్యయనం.. మరిన్ని నిజాలు బహిర్గతం
కేసీఆర్ పంపిన వీడియోలు, ఆడియోలపై సమగ్ర అధ్యయనం జరుగుతున్నది. సుప్రీంకోర్టు సైతం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నది. ఎమ్మెల్యేల ఎరపై లోతుగా విచారిస్తున్నది. ‘నమస్తే తెలంగాణ’తోపాటు వివిధ మీడియా సంస్థలు సైతం మరిన్ని విషయాలు వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంత జరుగుతుంటే.. బీజేపీ మాత్రం ఆ కేసుతో తమకేమీ సంబంధం లేదని భుజాలు తడుముకొంటున్నది. నిందితులకు సంబంధించిన మొబైల్స్, ల్యాప్‌టాపుల్లో నుంచి ఎవరైనా చూడగలిగిన నాన్ ఎన్క్రిప్టెడ్ డేటాను పోలీసులు ఇప్పటికే సేకరించారు. పంపిన వ్యక్తి, మెసేజ్ చేరిన వ్యక్తి ఇద్దరు మాత్రమే చూడగలిగిన ఎన్క్రిప్టెడ్ డేటాను, అందులోని రహస్య సమాచారాన్ని సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అందు కే.. కేసును మరిం త లోతుగా దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సీనియర్ అధికారులతో కూడిన సిట్ బృందం లోతైన అధ్యయనం చేస్తున్నది. మరికొద్ది రోజుల్లోనే… ఈ మొత్తం తతంగంలో తెరవెనుక కుట్రదారులు ఎవరు? పెద్ద తలకాయలు ఎవరు? ఇప్పటివరకు ఎకడెకడ ఇలా చేశారు? ఎకడ ఎంత ఎర వేశారు? ఈ డబ్బంతా ఎకడి నుంచి వచ్చింది? వీరి ట్రాప్‌లు ఎలా కొనసాగుతున్నాయియి? కుట్రదారులకు, బ్రోకర్లకు మధ్య సంబంధాలు ఏమిటి?లాంటి వివరాలన్నీ వెలుగులోకి రానున్నాయి.