హైదరాబాద్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించి అర్హతలు, విధి విధానాల రూపకల్పనకు ముగ్గురు మంత్రులతో క్యాబినెట్ సబ్‌కమిటీ నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చైర్మన్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): టాలీవుడ్ నటుడు నిడమర్తి రాజ్‌తరుణ్‌కు కోర్టులో ఊరట లభించింది. లావణ్య ఫిర్యాదుతో నార్సింగి పీఎస్‌లో నమోదైన కేసులో ఆయనకు హైకోర్టు ముం దస్తు బెయిల్ మంజూరు చేసింది. లావణ్య ఇంప్లీడ్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో రాజ్‌తరుణ్ రూ.20 వేల వ్యక్తిగత పూచీకత్తుతోపాటు అంతే మొత్తానికి మరో 2 పూచీకత్తులు సమర్పించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.