వినాయక్‌నగర్, మార్చి 3: ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన సబ్ రిజిస్ట్రార్‌ను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నది. నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్-2గా సీ శ్రీరామరాజు పని చేస్తున్నారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ ఆఫీస్‌కు రాగా, రిజిస్ట్రేషన్ కావాలంటే రూ.10 వేలు ఇవ్వాలని శ్రీరామరాజు స్పష్టంచేశారు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడు సోమవారం రూ.10 వేలు ఇచ్చేందుకు జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లి శ్రీరామరాజు సూచన మేరకు స్వీపర్ వెంకట్రావుకు అందజేశాడు.అక్కడే మాటు వే సిన ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ వారిని పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.