హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాలతో బస్సులు లేక నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో మహి ళలు ఇబ్బంది పడ్డారు. నేడు ఉన్న ట్రిప్పులను రద్దు చేస్తుండటంతో విద్యార్థులు (Students) తీవ్ర అసౌకర్యా నికి గురవుతున్నారు. తాజాగా న్యాలకొండపల్లిలో బస్సులు(RTC buses) లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడు తున్నారు. వివరాల్లోకి వెళ్తే..కరీంనగర్(Karimnagar )జిల్లా గంగాధర మండలం న్యాల కొండ పల్లి గ్రామానికి గతంలో రెండు బస్సులు ఒక్కోటి రెండు ట్రిప్పులు నడిపేవారు.
ఇప్పుడు ఒకే బస్సు నడపడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. న్యాలకొండపల్లిలోని ప్రభుత్వ పాఠ శాలలో 750 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ నేపథ్యంలో బస్సు ట్రిప్పును తగ్గించడంతో బస్సు లో 200 మంది వరకూ ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకే బస్సు రెండు ట్రిప్పులను నడపడంతో ఒక్కో ట్రిప్పులో 200 మంది ప్రయాణించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులో ఇరుకి రుకు ప్రయాణంతో ఇంటి నుంచి స్కూల్ వెళ్లే సరికి ఒళ్లు హూనమవుతున్నదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా బస్సులు రెండు ట్రిప్పులు నడుపాలని ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.