మేడ్చల్ మల్కాజ్గిరి : మేడ్చల్ జిల్లాలో ఉన్న టెక్ మహీంద్రా యూనివర్సిటీలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. 25 మంది విద్యార్థులకు, ఐదు మంది టీచర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మిగతా విద్యార్థులు, టీచర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. మిగతా విద్యార్థులు, టీచర్లు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని యూనివర్సిటీ యాజమాన్యం సూచించింది.