నెన్నెల : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా తిరంగా జండా రెపరెపలాడింది. 79వ స్వాతంత్య్ర దినోత్సవం ( Independence Day ) సందర్బంగా మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కేంద్రంలో విద్యార్థులు 79 మీటర్ల భారీ జాతీయ జెండాతో (National flag) వీధులలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రైవేట్ పాఠశాల లోటస్ విద్యార్థులు స్వతంత్ర దినోత్సవ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. పలు పాఠశాలల్లో చిన్నారులు, స్వతంత్ర సమరయోధుల వేశాధారణ లో వేడుకల్లో పాల్గొని అలరించారు. మండలంలోని ఆయా గ్రామాలలో జాతీయ జెండాలను ఎగురా వేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జెండాలను ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని వక్తలు పేర్కొన్నారు.