కోరుట్ల, ఫిబ్రవరి 26: జగిత్యాల జిల్లా కోరుట్లలోని అల్లమయ్య గుట్ట్ట ప్రభుత్వ మహిళా అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల విద్యార్థినులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పట్టణంలోని వేములవాడ రోడ్డు ప్రధాన రహదారిపై బైఠాయించారు. వసతి గృహంలో సౌకర్యాలు లేక రెండేండ్లుగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 50 మంది విద్యార్థులు చదువుతున్న కళాశాలలో రెండు వాష్‌రూమ్‌లు మాత్రమే ఉన్నాయని, వాటికి తలుపులు కూడా లేవని చెప్పారు.
సరైన ఫ్యాకల్టీ లేరని, సెమిస్టర్ పరీక్ష పేపర్లు యూనివర్సిటీ నుంచి రావాల్సి ఉండగా, ఇకడే అధ్యాపకులు తయారు చేసి మారులను కరెక్షన్ చేస్తున్నారని ఆరోపించారు. విద్యాబోధన సరిగా లేకపోవడంతో మారులు తకువగా వస్తున్నాయని, డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా ఫలితంలేకుండా పోయిందని వాపోయారు. రెండు గంటల పాటు ధర్నా చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.