నాగర్‌కర్నూల్ : కాంగ్రెస్ పాలనలో బంద్‌లు, రాస్తోరోకోలు, ధర్నాలతో రాష్ట్రం దద్దరిల్లుతున్నది. ప్రతి రోజు ఏదో ఒకచోట అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. విద్యార్థులు సరేసరి. పాలన పడకేయడంతో గురుకులాలు మృత్యు నిలయాలుగా మారుతున్నాయి. హాస్టళ్లలో కనీస వసతుల కోసం కూడా విద్యార్థులు వీధిన పడి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా నాగర్‌కర్నూల్ వెల్దండ మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహం విద్యార్థులు(Students protest) రోడ్డెక్కారు.
హాస్టల్లో భోజనం సరిగ్గా పెట్టడం లేదని, కనీస వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం శ్రీశైలం ప్రధాన రహదారిపై (Srisailam main road)బైఠాయించారు. కలెక్టర్ రావాలంటూ, హాస్టల్ వార్డెన్‌ను తొలగించాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. విద్యార్థుల ధర్నాతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులను బుజ్జగించే ప్రయత్నం చేశారు.
శ్రీశైలం ప్రధాన రహదారిపై విద్యార్థుల ధర్నా
నాగర్ కర్నూల్ – వెల్దండ మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో భోజనం సరిగ్గా పెట్టడం లేదని.. హాస్టల్లో కనీస వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని శ్రీశైలం ప్రధాన రహదారిపై విద్యార్థులు బైఠాయించారు.
కలెక్టర్ రావాలంటూ, హాస్టల్… pic.twitter.com/flFgH6tG3q
— Telugu Scribe (@TeluguScribe) November 12, 2024