వనపర్తి టౌన్, అక్టోబర్ 27 : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న రూ.8,500 కోట్ల బకాయిలు విడుదల చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పేద, మధ్య తరగతి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు.