ఉస్మానియా యూనివర్సిటీ: గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు శుక్రవారం అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీకి పోస్ట్ కార్డులు పంపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. రూ. 4000 నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కి సంవత్సరం గడుస్తున్నా.. హామీల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా హామీలను అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో విద్యారంగం కుంటుపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం లో విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయని వాపోయారు. ఈ సం దర్భంగా ప్రియాంక గాంధీజీ వేర్ ఈస్ మై స్కూ టీ..వివాంట్ స్కూటీ అంటూ విద్యార్థినులు నినదించారు.