Telangana | గ్రామాల నుంచి పట్టణాలకు అరకొర బస్సులు నడపడటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రమాదకరమని తెలిసినా కూడా ఫుట్‌బోర్డు ప్రయాణం చేసి స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో చదువు కోసం తమ ప్రాణాలనే ఫణంగా పెడుతున్నారు. ముఖ్యంగా షాద్‌నగర్ – ఆమనగల్లులో బస్సుల కొరత కారణంగా పలువురు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే తమకు భరోసా కల్పించాలంటూ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు లేఖ రాశారు.
గతంలో షాద్‌నగర్ – ఆమనగల్లు రూట్లో 10 బస్సులు నడిపిస్తే ఇప్పుడు.. కేవలం నాలుగు బస్సులే నడిపిస్తున్నారని సజ్జనార్‌కు రాసిన లేఖలో విద్యార్థులు పేర్కొన్నారు. ఆ నాలుగు బస్సులు కూడా సమయానికి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన బస్సుల్లో విద్యార్థులు సరిపోవడం లేదని తెలిపారు. అందుకే బస్సుల సంఖ్యను పెంచి విద్యాసంస్థల సమయానికి అనుగుణంగా నడిపించాలని కోరారు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని బస్సులు నడపాలని.. లేదంటే అందరం కలిసి ధర్నా చేస్తామని తెలిపారు. తమ గ్రామం నుంచి డిగ్రీ కాలేజీలు దూరంగా ఉండటంతో ఆర్టీసీ బస్ పాస్ పరిమితి 35 కిలోమీటర్లు సరిపోవడం లేదని ఓ విద్యార్థి తెలిపాడు. ఆర్టీసీ బస్ పాస్ పరిమితిని 45 కిలోమీటర్లకు పెంచాలని విజ్ఞప్తి చేశాడు.
d
విద్యార్థులు ఇలా ప్రమాదకరంగా ఫుట్‌బోర్డుపై వెళ్లడానికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఇలా ఫుట్‌బోర్డుపై ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించాలని.. బస్సుల సంఖ్యను పెంచాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ను కోరారు.
.@tgsrtcmdoffice @SajjanarVC Garu,
requested to look into the problem faced by students and take necessary action by increasing the number of buses to avoid the risky footboard travel by school children. Statewide, students are facing this issue. pic.twitter.com/sfbMXCDmuU— Harish Rao Thanneeru (@BRSHarish) October 22, 2024