కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ తీగలు(Electric shock) తెగిపడి విద్యా ర్థులకు గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన గంగాధర మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపూలే బాలుర గురుకుల పాఠశాలలో( Gurukula School) సోమవారం చోటుసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపడటంతో పాఠశాలలో చదువుతున్న ఎ.అశ్విత్, ఒ.అశ్విత్ అనే ఇద్దరు విద్యార్థులకు గాయా లయ్యాయి(Students injured). గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే క్షతగాత్రులను కరీంనగర్ సివిల్ హాస్పిటల్కు తరలించారు. విద్యుత్ అధికారులకు సమాచారమందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ ఏడీ సత్యనారాయణ ప్రమాదానికి గల కారణాన్ని పరిశీలించారు. విద్యుత్ తీగలపై కోతులు దుంకడంతో రెండు వైర్లు షాట్ సర్య్కూట్ అయి తెగిపడినట్లు తెలిపారు. కాగా, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను తరలించడానికి భవన యజమాని రెండేళ్ల క్రితమే 90 వేల డీడీ చెల్లించినట్లు తెలిపాడు. రెండేళ్లుగా తీగలను తరలించకుండా విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తు న్నట్టు భవన యజమాని అనిల్ తెలిపారు. విద్యార్థులు స్వల్పగాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పిందని పాఠశాల సిబ్బంది తెలిపారు. ఇప్పటికైనా కరెంట్ తీగలను మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.