హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఎప్‌సెట్ ఫలితాల్లో బీసీ గురుకుల సొసైటీ విద్యార్థులు ప్రతిభ చాటారు. సొసైటీ నుంచి ప్రవేశ పరీక్షలో 3,781మంది విద్యార్థులు అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 5వేల లోపు ర్యాంక్‌లు 43మంది, 10వేల లోపు ర్యాంక్‌లు 122 మంది, మొత్తంగా 1,626 మంది, ఇంజినీరింగ్ విభాగంలో 2,155 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో హర్షిణి(516వ ర్యాంక్), కల్పిత(1,315వ ర్యాంక్), శ్రవణ్‌కుమార్ (1,377వ ర్యాంక్), నవ్య(1,692వ ర్యాంక్) అత్యుత్తమ ర్యాంకులు సాధించగా, ఇంజినీరింగ్ విభాగంలో అనిరుధ్ (3,513వ ర్యాంక్), వినోద్‌కుమార్(3,568వ ర్యాంక్), రుషిక్వర్మ (4,433వ ర్యాంక్) సాధించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, శాఖ ముఖ్యకార్యదర్శి బాలమాయదేవి, గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు అభినందించారు.