మంచిర్యాల జిల్లా : రాష్ట్రంలోని గురుకులాలు రోగాలకు నిలయంగా మారాయి. పాలన పడకేయడంతో విద్యా కేంద్రాలుగా విలసిల్లాల్సిన గురుకు పాఠశాలలు విద్యార్థుల మృతితో స్మశానాలకుగా మారుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా ఘటన మరవక ముందే. మంచిర్యాల జిల్లాలో మరో సంఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్(Food poisoning) అవడంతో 12 మంది విద్యార్థులు అస్వస్థతకు(Students ill) గురయ్యారు. గుర్తించిన ఆశ్రమ పాఠశాల సిబ్బంది హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.
12 మంది విద్యార్థినులకు అస్వస్థత.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఆశ్రమ పాఠశాల సిబ్బంది. https://t.co/huMhQilfTO pic.twitter.com/WFaTYIIUyO
— Telugu Scribe (@TeluguScribe) November 6, 2024