 
                                                            బజార్హత్నూర్, అక్టోబర్ 30: ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం కోలారి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఐరన్ మాత్రలు వికటించడంతో అస్వస్థతకు గురయ్యారు. ప్రతి గురువారం వేసే ఐరన్ మాత్రలను ఆశ కార్యకర్త, ఉపాధ్యాయులు విద్యార్థులకు అందించారు. మధ్యాహ్న మాత్రలు వేసుకున్న 8 మంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పికి గురయ్యారు.
వెంటనే వీరిని పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసెకెళ్లారు. మండల వైద్యాధికారి భీంరావు పరీక్షలు చేశా రు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అబ్జర్వేషన్లో ఉంచాలని సూచించారు. నీటి కలుషితంతో ప్రమా దం జరిగి ఉండొచ్చని వైద్యసిబ్బంది తెలిపారు.
 
                            