యాదాద్రి భువనగిరి : కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థులు(Students protest) సమరశంఖం పూరిస్తున్నారు. పెండింగ్ స్కాలర్షిప్స్(Scholarships), ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమిస్తున్నారు. తాజాగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంటర్, డిగ్రీ విద్యార్థులు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను(Bhuvanagiri MLA camp office) ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్టంలో విద్యశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గు చేటన్నారు.
ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేశారు. క్యాంప్ ఆఫీస్ ముందు బైఠాయించి ఎమ్మెల్యే వస్తారా? స్కాలర్షిప్స్ ఇస్తారా? అంటూ నినాదాలతో హోరెత్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.
విద్యార్థులను ఈడ్చుకెళ్తున్న పోలీసులు
గేటు దూకి లోపలికి దూసుకెళ్తున్న విద్యార్థులు