హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు విడుదల చేసిన జీవో 33తో విద్యార్ధులు నష్టపోతున్నారని, ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ వైద్య విద్యార్ధుల పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవిప్రసాద్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు.. ఏడేండ్లలో నాలుగేండ్లు తెలంగాణలో చదివితే స్థానికత ఉన్నట్టుగా గుర్తించేవారని, ఇప్పుడు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు వరుసగా 4 ఏండ్లు చదివితేనే స్థానికులుగా గుర్తించడం సరికాదని వాపోయారు.