చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుప్రాన్పేటలో విషాదం చోటుచేసుకున్నది. జ్యోతీబా పూలే హాస్టల్ భవనంపై నుంచి దూకి ఐదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య (Student Suicide) చేసుకున్నది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సంధ్య తూప్రాన్పేటలోని జ్యోతీబా పూలే గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నది. ఇంటీవలే ఇంటికి వెళ్లిన సంధ్య.. ఆదివారమే గురుకులానికి వచ్చింది. సోమవారం ఉదయం హాస్టల్ భవనం నాలుగో అంతస్థు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్లో ఉండటం ఇష్టం లేక బలవన్మరణం చెందినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.