ఎస్సీ హాస్టల్లో ఉరేసుకున్న విద్యార్థిని
ఇంటర్ విద్యార్థిని హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బుధవారం చోటుచేసుకున్నది.
- కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఘటన
బాన్సువాడ, జూలై 8: ఇంటర్ విద్యార్థిని హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బుధవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. డోంగ్లి మండలం లక్ష్మాపూర్‌కు చెందిన సరిడెవార్ అమృత (17) బాన్సువాడలోని జూనియర్ కాలేజీలో బైపీసీలో అడ్మిషన్ తీసుకుని.. టీచర్స్ కాలనీలోని ఎస్సీ బాలికల వసతిగృహంలో చేరింది.
రెండు రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. తండ్రి మైసయ్యకు ఫోన్ చేసి విషయం చెప్పింది. మైసయ్య కూతురును చూసేందుకు బుధవారం హాస్టల్‌కు వెళ్లాడు. గది తలుపులు మూసి ఉండటంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. విషయం తెలిసి బీఆర్ఎస్తోపాటు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మృతికి హాస్టల్ వార్డెన్ కారణమని, విద్యార్థి నుంచి రూ.10 వేలు డిమాండ్ చేసిందని ఆరోపించారు. ఆర్డీవో రవీందర్‌రెడ్డి, డీఎస్పీ విఠల్‌రెడ్డి విద్యార్థిసంఘాల నేతలతో మాట్లాడి సర్దిచెప్పారు. వార్డెన్ తప్పు ఉందని తేలితే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

