ఇందల్వాయి, డిసెంబర్ 2: గురుకుల పాఠశాలలో స్పృహ కోల్పోయిన ఓ విద్యార్థినిని బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ దవాఖానకు తరలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేసేందుకు వెళ్తూ రాజారాం సోమవారం నిజామాబాద్ జిల్లా తిర్మన్పల్లిలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలను సందర్శించారు. నీరసంగా ఉన్న ఓ బాలిక ఉన్నట్టుండి స్పృహ కోల్పోయింది. రాజారం యాదవ్ ఆటో తీసుకొచ్చి ఆమెను ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో గురుకులాల వ్యవస్థ దెబ్బ తిన్నదని ఆరోపించారు.