కులకచర్ల, ఫిబ్రవరి 13 : గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. వికారాబాద్ మండలం మద్గుల్ చిట్టెంపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన టేకులబీడ్ తండాకు చెందిన చందర్, సోనిబాయ్ దంపతుల రెండో కుమారుడు నేనావత్ దేవేందర్ (16) కులకచర్లలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ఉంటూ కులకచర్ల బాలుర ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. బుధవారం రాత్రి అందరితోపాటు భోజనం చేసి వసతి గృహంలో నిద్రించాడు. ఉదయం తోటి స్నేహితులు లేచి తమ పనులు పూర్తిచేసుకొన్నా.. దేవేందర్ నిద్రలేవలేదు. అతడిని లేపడానికి ప్రయత్నించగా అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి కేర్ టేకర్ రాజేందర్‌కు సమాచారమిచ్చారు. ఆయన వెంటనే 108 వాహనంలో పరిగి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
అక్కడ వైద్యులు పరీక్షించి విద్యార్థి అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. అతడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమాననాస్పదంగా మృతి చెందినట్టు కేసునమోదు చేశామని ఎస్సై అన్వేశ్‌రెడ్డి తెలిపారు. కాగా పరిగి ప్రభుత్వ దవాఖాన ముందు దేవేందర్ కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మృతుని కుటుంబ సభ్యులను వేర్వేరుగా కలిసి పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మృతుడి కుటుంబసభ్యులకు రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు. విద్యార్థి మృతి కేసును విచారణ జరిపి కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 13 : నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో కొనసాగుతున్న తాడూరు మండలానికి చెం దిన మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పా ఠశాలలో ఇద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. బుధవారం సాయంత్రం గురుకులంలోని విద్యార్థినులకు స్నాక్స్ అందించా రు. తర్వాత ఏడో తరగతికి చెందిన ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతుండగా సిబ్బంది వెంటనే స్థానిక ప్రైవేటు దవాఖాన తరలించగా.. పరీక్షించిన డాక్టర్లు చందన పరిస్థితి విషమంగా ఉందని, మరో విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ప్రిన్సిపాల్ రష్మిని వివరణ కో రగా.. విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ కాలేదని, కడుపునొప్పి రావడంతో దవాఖానకు తరలించినట్టు తెలిపారు.