ఆదిలాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జైనథ్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు లక్ష్మీపూర్ రిజర్వాయర్లో పడిపోగా..ప్రియాంక(15) అనే విద్యార్థిని మృతి చెందింది.
కాగా, ప్రీతి అనే మరో బాలికను స్థానికులు రక్షించి రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. విద్యార్థులు ప్రమాదవశాత్తు రిజర్వాయర్లో పడిపోయారా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.