మంచిర్యాల అర్బన్, జూలై 29 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల మిమ్స్ ఐ ఐటీ అండ్ నీట్ అకాడమీ క్యాంపస్, హాస్టల్ భవనం పై నుంచి పడి ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. లక్షెట్టిపేటకు చెందిన కొత్తపల్లి రమేశ్-వనిత దంపతుల కుమార్తె సహస్ర (18) మంచిర్యాల పట్టణం బైపాస్‌రోడ్డులోని తెలంగాణ తల్లి చౌరస్తాలోని మిమ్స్ కళాశాలలో ఎంపీసీ ఇంటర్ సెకండియర్ చదువుతున్నది. సహస్ర మంగళవారం సాయంత్రం మూడో అంతస్థులో గల గ్రిల్స్ లేని ఓపెన్‌గా ఉన్న కిటికీ నుంచి అనుమానాస్పదంగా కింద పడింది. తీవ్రగాయాలైన విద్యార్థిని కళాశాల నిర్వాహకులు ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా, మృతి చెందింది. కాగా ఈ ఘటనపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
కేసు పెట్టారని ఆత్మహత్యాయత్నం ; పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వైనం
నీలగిరి, జూలై 29. తనపైనే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడతారా అంటూ ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని అంటించుకున్న ఘటన సోమవారం అర్ధరాత్రి నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది. వన్‌టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వన్‌టౌన్ ఎస్ఐ సైదులు దేవరకొండ రోడ్లో వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో నల్లగొండ పట్టణానికి చెందిన రావిళ్ల నర్సింహ వాహనాన్ని ఆపి ఆల్కహాల్ టెస్టు నిర్వహించగా 155 ఎంజీ/100ఎంఎల్ రీడింగ్ వచ్చిం ది. దీంతో కౌన్సెలింగ్ ఇచ్చి ఉదయాన్నే స్టేసన్‌కు రావాలని పంపించారు. అక్కడి నుండి వెళ్లిపోయిన నర్సింహ తరువాత వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఒంటిపై పెట్రోల్ పో సుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న హోంగార్డ్ ప్రవీణ్ అడ్డుకోగా అతడికి కూడా గాయాలు అయ్యాయి. వెంటనే వారిని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు సీఐ వెల్లడించారు.