జడ్చర్ల టౌన్, జనవరి 31 : మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. బీహార్ రాష్ట్రంలోని హుంగాబాద్ జిల్లాకు చెందిన రోణక్రాజ్ (20) జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని ఎన్మిమ్స్ యూనివర్సిటీ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం కళాశాలలో నిర్వహించిన మ్యాథ్స్ సబ్జెక్టు సెమిస్టర్లో మాల్‌ప్రాక్టిస్ చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో అవమానాన్ని తట్టుకోలేక కళాశాలలోని హాస్టల్ గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకొన్నాడు. కళాశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు జడ్చర్ల సీఐ కమలాకర్ విచారణ చేపట్టారు.