మునిపల్లి, జూలై 21 : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ శివారులోని వోక్సన్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మునిపల్లి ఎస్సై వివరాల ప్రకారం.. వోక్సన్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్న రుషికేశ్(19) సోమవారం క్యాంపస్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్యకు ముందు రుషికేశ్ తన మొబైల్లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. రుషికేశ్ హైదరాబాద్‌లోని సరూర్నగర్వాసిగా గుర్తించారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్థి సెల్పీ వీడియోలో ఏముందో తెలియాల్సి ఉంది.