భూత్పూర్, జూలై 9 : స్కూల్‌కు వెళ్లనంటూ చేతులపై పెట్రోల్ పోసుకొని విద్యార్థి నిప్పంటించుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. భూత్పూరు మండలం చౌలతండాకు చెందిన హన్మంతు వలస పనుల కోసం హైదరాబాద్‌కు వెళ్లాలనుకొన్నాడు. ఈ క్రమంలో కుమారుడు ఆకాశ్‌ను సమీప గ్రామమైన కరివెనలో ఉన్న మదర్ థెరిస్సా పాఠశాలలో హాస్టల్ వసతి ఉండటంతో చేర్పించేందుకు బుధవారం వెళ్లాడు.
పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి అక్కడే కొడుకును వదిలి వెళ్లిపోయాడు. గురువారం విశ్రాంతి సమయంలో పెన్ను తెచ్చుకుంటానని చెప్పి బయటకు వెళ్లిన ఆకాశ్.. అక్కడే ఉన్న కిరాణం షాపులో పెట్రోల్ తీసుకొని చేతులపై పోసుకొని కాల్చుకున్నాడు. స్థానికులు విషయాన్ని ఉపాధ్యాయులకు తెలియజేయగా.. వెంటనే భూత్పూర్ పీహెచ్‌సీకి, అక్కడి నుంచి జిల్లా దవాఖానకు తరలించారు. ఆకాశ్ తమ పాఠశాలలో అడ్మిషన్ తీసుకోలేదని యాజమాన్యం చెప్పడం గమనార్హం.