నల్లగొండ : కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతున్నది. పురుగులన్నం, నీళ్ల చారు ఇదేంటని ప్రశ్నిస్తే మమ్మల్ని కుక్కలకన్నా దారుణంగా చూస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ (Nallagonda)జిల్లా హాలియా పట్టణంలోని తుమ్మడం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో(BC Gurukula Girls School) పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళనకు(Student agitation) దిగారు.
మధ్యాహ్న భోజనంలో నిత్యం పురుగుల అన్నం, చికెన్, సాంబార్లో నీళ్లు ఉన్నాయని తినలేక ఆకలితో అలమటిస్తున్నామని తెలిపారు. ఇదేంటని అడిగితే ప్రిన్సిపాల్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుందని వాపోయారు. 400 మంది విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లకుండా ఆడిటోరియంలో కూర్చుని నిరసన తెలిపారు. ఈ ప్రిన్సిపాల్ ఉంటే మేమే మూకుమ్మడిగా టీసీ తీసుకొని వెళ్లిపోతామని విద్యార్థినిలు హెచ్చరించారు.
కుక్కలకన్నా దారుణం చూస్తున్నారు.. కుక్కలకి ఇచ్చిన విలువ కూడా మాకు ఇవ్వటం లేదంటూ గురుకుల విద్యార్ధినుల ఆవేదన
పురుగుల అన్నం పెడుతున్నారని బీసి గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్ధినుల నిరసన.
ఆకలితో అలమటిస్తున్నాం అంటూ 400 మంది గురుకుల విద్యార్ధినుల ఆందోళన
హాలియా పట్టణంలోని తుమ్మడం… pic.twitter.com/WK8zO8hSCG
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2024