హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): పాత పెన్షన్ అమలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మే 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ఎస్సీఆర్ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ శంకర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలోని జేఎఫ్ఆర్వోపీఎస్లోని అన్ని సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వాలని ఈ నెల 19న నిర్ణయించినట్టు తెలిపారు.